భారతదేశం, జనవరి 28 -- బాలీవుడ్ సీనియర్ యాక్టర్ పరేశ్ రావల్, ఆదిల్ హుసేన్ ప్రధాన పాత్రల్లో 'ది స్టోరీటెల్లర్' చిత్రం రూపొందింది. బెంగాలీ దిగ్గజ రచయిత, దర్శకుడు సత్యజిత్ రే రచించిన ఓ కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. దీంతో ఈ మూవీపై ముందు నుంచి కొందరు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేడు (జనవరి 28) స్ట్రీమింగ్‍కు ఈ చిత్రం రావాల్సి ఉంది. అయితే, మధ్యాహ్న సమయానికి కూడా రాకపోవటంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అయితే, ఎట్టకేలకు సాయంత్రం ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది.

ది స్టోరీటెల్లర్ చిత్రాన్ని జనవరి 28వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురాన్నట్టు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్రకటించింది. దీంతో ఈ చిత్రం కొందరు వేచిచూశారు. అయితే, నేడు మధ్యాహ్నం అయినా ఇంకా ఈ మూవీ హాట్‍స్టార్‌లో అందుబాటులోకి రాలేదు. ఈ చిత్రం పేజ్ ఎర్రర్ చూపించింది. దీంతో ప్రేక్షకుల్లో...