భారతదేశం, జనవరి 23 -- ఈ వారం మరో మలయాళ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. ఈ సినిమా పేరు 'శేషిప్పు' (Sheshippu). కేరళ ఫిల్మ్ ఫెస్టివల్లో మూవీని ప్రదర్శించిన తర్వాత థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే తీసుకు రావడం విశేషం.

ఈ మలయాళం థ్రిల్లర్ సినిమా శేషిప్పు ఆన్‌లైన్ అరంగేట్రం వివరాలు ఈ వారం ప్రారంభంలోనే ఖరారయ్యాయి. 2025లో జరిగిన కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFK)లో ఈ సినిమా ప్రదర్శనను మిస్ అయిన వారు.. దీని ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం వేరే ఇతర మలయాళ సినిమాలు ఆన్‌లైన్‌లోకి రాలేదు. దీంతో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి 'శేషిప్పు' ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఈమధ్యే సన్ నెక్స్ట్ (Sun NXT)లో విడుదలైన మలయాళ సినిమాలలో 'ఇత్తిరి నేరం', 'కిర్క్కన్',...