Hyderabad, ఫిబ్రవరి 13 -- OTT: కొన్ని సినిమాలు ఒకటి కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పైకి రావడం ఈ మధ్యకాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చిన్న సినిమాలు ఇలా రెండు, మూడు ప్లాట్‌ఫామ్స్ లోకి వస్తున్నాయి. తాజాగా తెలుగు రూరల్ డ్రామా థ్రిల్లర్ మూవీ పొట్టేల్ కూడా ముచ్చటగా మూడో ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పటికే రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అనన్య నాగళ్ల నటించిన మూవీ పొట్టేల్. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాగా.. డిసెంబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ కూడా ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి ఈ సినిమాను సన్ నెక్ట్స్ లో చూడొచ్చు.

"చదువు కోసం ఓ తండ్...