భారతదేశం, జనవరి 23 -- ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్ లను సినిమాల రూపంలో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ మధ్య పలువురు మేకర్స్ చేస్తున్నారు. అయితే సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన కానిస్టేబుల్ కనకం మూడో సీజన్ మాత్రం ఓటీటీలో కాకుండా థియేటర్లలోకి వస్తుండటం విశేషం.

ఈటీవీ విన్ ఓటీటీ తీసుకొచ్చిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి కానిస్టేబుల్ కనకం. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కంటే ఈ మధ్యే వచ్చిన రెండో సీజన్ కు మరింత మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపులో ఇప్పుడు మూడో సీజన్ తీసుకురానున్నారు. అయితే దీనిని థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించడమే ఇక్కడ అసలు విశేషం.

ఇదే విషయాన్ని చెబుతూ ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (జనవరి 22) రాత్రి ట్వీట్ చేసింది. "స్టోరీ మరింత పెద్దదైంది. మిస్టరీ మరింత తీవ్రంగా మ...