భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో నయా సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. విభిన్న జానర్లలో కంటెంట్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇందులో ఏడు రిలీజ్‍లపై ఎక్కువ ఆసక్తి ఉంది. వివిధ జానర్లలో ఇవి ఉన్నాయి. రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ఇదే వారం అడుగుపెట్టనుంది. భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరంపై రూపొందిన ఓ సిరీస్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న 7 ముఖ్యమైన రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ పొటిలికల్ యాక్షన్ మూవీ నెలలోగానే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడలో ప్రైమ్ వీడియోలో మరో రెండు రోజుల్లో ఈ చ...