భారతదేశం, జనవరి 30 -- ఓటీటీలో డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు అలాంటి భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ '45' సినిమా ఓటీటీలో తెలుగులో వచ్చింది. ఇవాళ (జనవరి 30) నుంచి తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ కన్నడ సినిమా. ఇందులో శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి లాంటి స్టార్లు నటించారు.

45 రోజుల కర్మ ఫలం అనుభవించాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ '45'. ఇది ఓటీటీలో అదరగొడుతోంది. ఈ రోజు నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ ఫాంటసీ థ్రిల్లర్ 45 సినిమా.

భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా డిసెంబర్ 25, 2025న రిలీజైంది 45 మూవీ. ఈ సినిమా రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ...