Hyderabad, మార్చి 25 -- Netflix OTT Trending Movies Telugu Today: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతోంది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులతో ఓటీటీ లవర్స్‌ను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంది. అయితే, ఇవాళ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలు, వాటిలో చూడాల్సిన, తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ది బెస్ట్ 5 మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

తమిళ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్, బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన డ్రాగన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇటీవలే స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఓటీటీ రిలీజ్ అయిన త్వరలోనే టాప్‌లో దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 1 స్థానంలో డ్రాగన్ నిలబడి సత్తా చాటింది. ఇది...