భారతదేశం, మార్చి 25 -- OTT: త‌మిళ మూవీ కుడుంబ‌స్థాన్ ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. ఇటీవ‌ల జీ5 ఓటీటీలో రిలీజైన ఈ మూవీ 200 మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ విష‌యాన్ని జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఓటీటీలో హ‌య్యెస్ట్ స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న మూవీగా కుడుంబ‌స్తాన్ నిలిచింది.

కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ కోలీవుడ్ మూవీలో మ‌ణికంద‌న్ హీరోగా న‌టించాడు. తెలుగు అమ్మాయి శాన్వీ మేఘ‌న హీరోయిన్‌గా క‌నిపించింది. రాజేశ్వ‌ర్ క‌లిస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 30 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది.

ఓ మిడిల్ క్లాస్ క...