భారతదేశం, మార్చి 19 -- ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ జుడ్వా నంబ‌ర్ వ‌న్ ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్టీఆర్ చేసిన బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కాదిది. డ‌బ్బింగ్ మూవీ. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన అదుర్స్ మూవీ జుడ్వా నంబ‌ర్ వ‌న్ పేరుతో హిందీలోకి డ‌బ్ అయ్యింది. ఈ డ‌బ్బింగ్ వెర్ష‌న్ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చింది. తొలిరోజే ఈ సినిమాకు ఓటీటీలో భారీగా వ్యూస్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో రూపొందిన అదుర్స్ మూవీ 2010లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ చేశాడు. న‌ర‌సింహా అనే గ్యాంగ్‌స్ట‌ర్‌గా చారి అనే బ్రాహ్మ‌ణుడిగా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ మూవీ అప్ప‌ట్లోనే ...