భారతదేశం, జనవరి 23 -- ప్రేమమ్ హీరో గుర్తున్నాడా? ఈ సెన్సేషన్ రొమాంటిక్ డ్రామాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు నివిన్ పాలీ. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న అతనికి సర్వం మాయ రూపంలో ఓ బ్లాక్‌బస్టర్ దక్కింది. గతేడాది చివర్లో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైన మలయాళ హారర్ కామెడీ మూవీ సర్వం మాయ (Sarvam Maya). ఈ సినిమా జనవరి 30 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళ వెర్షనే రానుండటం కాస్త నిరాశ కలిగించేదే.

కానీ త్వరలోనే ఇతర భాషల గురించి కూడా ఆ ఓటీటీ సమాచారం ఇవ్వనుంది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సర్వం మాయ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా...