భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఓటీటీలో వచ్చే కంటెంట్‌లో ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జోనర్స్‌కు అంతా అట్రాక్ట్ అవుతుంటారి. ఎంత డిఫరెంట్‌గా ఈ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తే అవి అంతగా క్లిక్ అవుతాయి. అయితే, తాజాగా ఓటీటీలోకి నయా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఇలా రాగానే ఆ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 9.9 రేటింగ్ రావడం ఓటీటీ ఆడియెన్స్‌కు ఆశ్చర్యం కలిగిస్తోంది. రేటింగ్‌తో క్రేజ్ తెచ్చుకున్న ఆ వెబ్ సిరీస్ పేరు రాక్షస (Raakshasa). ఇది కన్నడ భాషలో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.

ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌లో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. మయూరి క్యాతరి హీరోకు భార్యగా నటించింది. ఈ ఇద్దరితోపాటు రాక్షస ఓటీటీ సిరీస్‌లో అప్పన్న రామదుర్గ, అవినాష్, జహంగిర్ ఎమ్ఎస్, అభిజ...