Hyderabad, మార్చి 4 -- Daredevil Born Again OTT Release: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివిధ రకాల ఫేజ్‌లతో ఎన్నో ఫ్రాంచైజీ సినిమాలు, సిరీస్‌లను తెరకెకిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎమ్‌సీయూ నుంచి డేర్ డెవిల్ వెబ్ సిరీస్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

డేర్ డెవిల్ సిరీస్ ఒక సూపర్ హీరో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. మార్వెల్ కామిక్స్ బుక్ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ఫ్రాంఛైజీలో మ్యాట్ మర్డోక్ (చార్లీ కాక్స్) ఒక లాయర్. కానీ, అతను అంధుడు. అయితే, పగలు కోర్టులో కేసులు వాదించే ఈ లాయర్ రాత్రి సమయంలో మాత్రం నేరస్థులను అతి కిరాతంగా, రాక్షసంగా చంపుతుంటాడు.

ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్‌లో మూడు సిరీస్‌లు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా రూపొందిన డేర్ డెవిల్ 3 సీజన్స్ వరకు ఎంతగానో మార్వెల్ అభిమానులను ఆకట్టుకుంది. 2018లో డేర్ ...