Hyderabad, మార్చి 13 -- Azaad OTT Release Date Official Announcement: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఆజాద్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారిక ప్రకటన తాజాగా ఇచ్చింది. ఆజాద్ సినిమాలో అమన్ దేవగన్, రాషా తడానీ హీరో హీరోయిన్స్‌గా నటించారు. అయితే, వీరిద్దరికి ఈ సినిమానే తొలి చిత్రం.

బాలీవుడ్‌లో ఆజాద్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు రాషా తడానీ, అమన్ దేవగన్. ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి రవీనా టాండన్ కుమార్తెనే రాషా తడానీ. అలాగే, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్. వీరిద్దరి జంటగా వచ్చిన ఆజాద్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా సినిమాలో ఉయ్ అమ్మ పాట సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది.

ఆజాద్‌లోని ఉయ్ అమ్మ సాంగ్‌లో రాషా తడానీ డ్యాన్స్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్, హాట్‌నెస్‌కు ...