Hyderabad, మార్చి 29 -- Choo Mantar OTT Release: ఓటీటీలో ఎన్ని రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే జోనర్ హారర్. ఈ జోనర్‌లో కథ ఎలా ఉన్న థ్రిల్లింగ్ నెరేషన్‌తో భయపెట్టే సీన్స్‌తో మూవీ తెరకెక్కిస్తే మంచి హిట్ అందుకుంటుంది.

ఇక ఇటీవల కాలంలో కేవలం ఒక హారర్‌ జోనర్‌లోనే కాకుండా వాటికి అదనంగా కామెడీ, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ వంటి ఎలిమెంట్స్ జోడించి మరింత ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్‌గా థియేటర్లలో విడదలైన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీనే ఛూ మంతర్. కన్నడ ఇండస్ట్రీలో జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

సుమారు రూ. 2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఛూ మంతర్ మూవీ బాక్సాఫీస్ వద్ద 25 రోజుల్లో రూ. 5.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఎక్కువగా ప్రచారం చేయకపోవడం...