భారతదేశం, జనవరి 28 -- మలయాళ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉంటుంది. మన ఆడియన్స్ కేరళ చిత్రాలను ఆదరిస్తూనే ఉంటారు. అందుకే ఓటీటీలో మలయాళం సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు మోహన్ లాల్, దిలీప్ కీలక పాత్రలు పోషించిన 'భా భా బా' సినిమా కూడా ఓటీటీలో తెలుగులోకి వచ్చేసింది.

సినిమా పేరు వింటేనే వెరైటీగా ఉంది కదూ. ఇదో మలయాళ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే కామనర్ స్టోరీ ఆధారంగా భా భా బా మూవీ తెరకెక్కింది. ఈ సినిమా జీ5 ఓటీటీలో ఉంది. అయితే జనవరి 16నే మలయాళంలో రిలీజైంది. ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది.

మలయాళ సినిమా భా భా బా మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. దీని బడ్జెట్ రూ.30 కోట్లు. దీనికి ప్రపంచవ్యాప్తంగా రూ.46.06 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే భా భా బా మూవీ సూపర్ హిట్ అని చెప...