భారతదేశం, ఫిబ్రవరి 11 -- OTT: త‌మిళ సినిమాలు లారా, పార్క్ సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చాయి. టెంట్‌కోట ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. పార్క్ మూవీ గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా...లారా మూవీ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన లారా మూవీలో అశోక్ కుమార్ బాల‌కృష్ణ‌న్‌, అనుశ్రేయ రాజ‌న్‌, క‌థిరేస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాక మ‌ణిమూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. ట్విస్ట్‌లు బాగున్నా, ఇన్వేస్టిగేష‌న్ సీన్స్ ఆస‌క్తిగా రాసుకోలేక‌పోవ‌డం, బోరింగ్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఓ బీచ్‌లో మ‌హిళ డెడ్‌బాడీ దొరుకుతుంది. ఆ డెడ్‌బాడీ ఎమ్మెల్యే డ్రైవ‌ర్ లారా భార్యద‌ని పోలీసులు అనుమానిస్తారు. లారాకు ఎమ్మెల్...