Hyderabad, ఫిబ్రవరి 28 -- OTT Movies With Single Role: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు అలరిస్తున్నాయి. అయితే, సినిమా అన్నాక చాలా మంది నటీనటులు ఉంటారు. కానీ, కేవలం ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. కేవలం సింగిల్ పాత్రతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 7 సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పెళ్లి బట్టల కోసం షాపింగ్‌కు వెళ్లిన అమ్మాయికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చి అక్కడే ఇరుక్కుపోతే. ఈ కాన్సెప్ట్ పైన వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే హలో మీరా. కేవలం గంట 33 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా కేవలం ఒకే ఒక్క పాత్రతో సాగుతుంది. ప్రస్తుతం హలో మీరా మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు ముద్దుగుమ్మ నందిత శ్వేత నటించిన ఎమోషనల్ డ్రామా చిత్రం రారా పెనిమిటి. ఎన్టీఆర్...