భారతదేశం, మార్చి 8 -- సాధారణంగా ఎక్కువ శాతం తెలుగు చిత్రాలు ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజైన సుమారు నెలకే ఓటీటీల్లోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం రెండు నెలలకో.. మూడు నెలలకో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతున్నాయి. అయితే, తెలుగులో రెండు పాపులర్ చిత్రాలు.. స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడైనా ఓటీటీలోకి వస్తాయా లేదా అనే సస్పెన్స్‌ రేపాయి. ఆ రెండు డిజాస్టర్ చిత్రాలే. కానీ ఆలస్యం అవుతుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో క్యూరియాసిటినీ పెంచాయి. అవే 'ఏజెంట్', 'మనమే' చిత్రాలు. ఈ రెండు సినిమాలు ఇదే నెలలో స్ట్రీమింగ్‍ ఫిక్స్ చేసుకున్నాయి. మనమే ఇప్పటికే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఏజెంట్ డేట్ ఖరారైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం 2023 ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్...