భారతదేశం, మార్చి 29 -- ఉగాది పండుగ రోజున (మార్చి 30) ఇంట్లోనే ఓటీటీలో సినిమా చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇటీవల వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో చాలా చిత్రాలు వచ్చాయి. స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. వాటిలో ఆరు చిత్రాలు పండుగ రోజు చూసేందుకు సూటవుతాయి. కామెడీతో సరదాగా ఉండే సినిమాలు కూడా ఉన్నాయి. పండుగకు చూసేందుకు ఆరు బెస్ట్ సినిమాల ఆప్షన్లు ఇవే.

ఉగాది రోజున సరాదాగా లేటెస్ట్ కామెడీ సినిమా చూడాలనుకుంటే 'మజాకా' సూటవుతుంది. సందీప్ కిషన్ రీతూ వర్మ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం ఇటీవలే మార్చి 28న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోరావు రమేశ్, మన్మథుడు ఫేమ్ అన్షు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. మజాకా చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజై అనుకున్న రేంజ్‍లో సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా జీ5లో చూసేయ...