భారతదేశం, జనవరి 23 -- లాంగ్ వీకెండ్ వచ్చేస్తోంది. మరి ఓటీటీ లవర్స్ ఇంకెందుకు లేటు. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన లేటెస్ట్ మూవీస్ పై ఓ లుక్కేయండి. వీకెండ్ కు చూడాల్సిన స్పెషల్ సినిమాల లిస్ట్ ఇక్కడుంది. వీకెండ్ ను ఈ మూవీస్ తో ఎంజాయ్ చేయండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ 5, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారం హిట్ చిత్రాలను చూడండి.

తమిళ స్టార్ హీరో ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన మూవీ తేరే ఇష్క్ మే. తెలుగులో ఇది అమర కావ్యం పేరుతో థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకున్న ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జవనరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది శంకర్, ముక్తిల రొమాంటిక్ లవ్ స్టోరీ.

ఒక గురువు నుండి కవిత్వం నేర్చుకున్న ఒక వ్యక్తి, అతని కూతురితో ప్రేమలో పడతాడు. ఈ కథతో తెరకెక్కిన లవ్ ఫీల్ గుడ్ మూవ...