భారతదేశం, జనవరి 24 -- భయపెట్టే హారర్ థ్రిల్లర్ ఓ వైపు.. సీరియల్ కిల్లర్ స్టోరీతో సస్పెన్స్ రేపే క్రైమ్ థ్రిల్లర్ మరోవైపు.. బోల్డ్ సీన్లతో సాగే హాట్ మూవీ ఇంకోవైపు.. ఇలా ఈ వారం ఓటీటీలోకి డిఫరెంట్ జోనర్లలో వేర్వేరు తెలుగు సినిమాలు వచ్చేశాయి. డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఆది శంబాల నుంచి శోభితా ధూళిపాళ చీకటిలో వరకు ఉన్నాయి.

ఈ వారం తెలుగు ఆడియన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన ఓటీటీ రిలీజ్ మూవీ 'శంబాల'. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ సాధించింది. ఆదికి చాలా కాలం తర్వాత హిట్ అందించింది.

ఆకాశంలో నుంచి ఓ ఉల్క శంబాల అనే గ్రామంలో పడుతుంది. ఆ తర్వాత అక్కడ వింత సంఘటనలు, హత్యలు జరుగుతాయి. దెయ్యం అని జనాలు భయపడతారు. మరి అప్పుడు జియాలజిస్ట్ అయిన హీరో ఏం చేశాడు? అన్నది ఉత్కంఠ రేపుతోంద...