Hyderabad, మార్చి 14 -- OTT: ఓ చిన్న లైన్ నే సినిమా కథగా మార్చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మలయాళం ఫిల్మ్ మేకర్స్ కు వెన్నెతో పెట్టిన విద్య. ఓటీటీ వచ్చిన తర్వాత అక్కడి చిన్న చిన్న సినిమాలు కూడా డబ్ అయి తెలుగు వాళ్ల ముందుకు వస్తున్నాయి. అలా శుక్రవారం (మార్చి 14) జియోహాట్‌స్టార్ ద్వారా వచ్చిన సినిమాయే పోన్‌మ్యాన్ (Ponman).

ఈ ఏడాది జనవరిలో మలయాళంలో రిలీజైన మూవీ పోన్‌మ్యాన్. బేసిల్ జోసెఫ్ నటించిన ఈ సినిమా కామెడీని పంచడంతోపాటు ప్రేక్షకులను ఎమోషనల్ చేసేస్తోంది. శుక్రవారం (మార్చి 14) జియోహాట్‌స్టార్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ రావడంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా బాగానే చూస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మలయాళం మూవీ ఇదే అని సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు.

జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాలేదు. అయితే ఓట...