Hyderabad, మార్చి 3 -- Oscars Gift Bag: ఆస్కార్స్ గెలవడం అనేది ప్రతి యక్టర్, టెక్నీషియన్ కల. అయితే ఈ అవార్డు గెలవని వారికి ఇచ్చే ఆస్కార్స్ గిఫ్ట్ బ్యాగ్ దక్కినా గొప్పే అనుకోవాలి. ఎందుకంటే ఈసారి దీని విలువ ఏకంగా 2.17 లక్షల డాలర్లు (సుమారు రూ.1.9 కోట్లు) కావడం విశేషం. ఇంతకీ ఈ బ్యాగులో ఏముంటాయి? ఈసారి ఎవరు గెలుచుకున్నారన్న విషయాలు ఇక్కడ చూడండి.

ఆస్కార్స్ 2025 గిఫ్ట్ బ్యాగ్ లో ఎప్పటిలాగే లగ్జరీ స్కిన్ కేర్ ప్రోడక్టులు, సినిమాలకు సంబంధించిన మర్చెండైజ్, ఫైవ్ స్టార్ వెకేషన్ల వంటివి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఈ ఏడాది మొదట్లో లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు వల్ల ఇళ్లు కోల్పోయిన వారి కోసం కూడా ప్రత్యేకంగా డిజాస్టర్ రికవరీ సర్వీస్ అయిన బ్రైట్ హార్బర్ మెంబర్షిప్ కూడా ఉండటం విశేషం. వీటికి తోడు గంజాయిని కూడా ఇందులో చేర్చారు.

వీటిని అందుకున్న వారికే కాకుండా ...