భారతదేశం, మార్చి 3 -- ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 అవార్డుల ప్రదానోత్సవం అమెరికా లాస్‍ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో కళ్లు చెదిరేలా జరిగింది. 2024లో వచ్చిన చిత్రాలకు గాను ఈ 97వ అకాడమీ అవార్డుల వేడుక సాగింది. హాలీవుడ్ సినీ స్టార్లు ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు. అవార్డుల ఈవెంట్ వేడుకలా సాగింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ఈవెంట్‍కు కొనాన్ ఓబ్రెయిన్ హెస్ట్ చేశారు. అదిరిపోయే పర్ఫార్మెన్సులు అలరించాయి. 'అనోరా' చిత్రానికి ఐదు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‍ప్లే, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల్లో మూడు అవార్డులను సొంతం చేసుకున్నారు సీన్ బేకర్.

భారత షార్ట్ ఫిల్మ్ 'అనూజ'కు ఆస్కార్ 2025 అవార్డుల్లో నిరాశ ఎదురైంది. డ్యూన్ పార్ట్ 2 మూవీకి రెండు అవార్డులు దక్కాయి. ఆస్కార్ 2025 అవార్డుల విజేతల పూర్తి లిస్ట్ ఇక్క...