భారతదేశం, మార్చి 3 -- Oscars 2025: ఆస్కార్ అవార్డుల్లో ఈ సారి ఇండియా నుంచి ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీల్లో ఒక్క సినిమా తుది నామినేష‌న్స్‌లో నిల‌వ‌లేదు. కానీ లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మించిన అనూజ ఆస్కార్ ఎంట్రీని ద‌క్కించుకొని ఆశ‌లు రేకెత్తించింది. ఖ‌చ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌ను గెలుచుకుంటుంద‌ని సినీ వ‌ర్గాల‌తో పాటు మేక‌ర్స్ భావించారు. కానీ వారికి నిరాశే మిగిలింది.

లైవ్ యాక్ష‌న్ కేట‌గిరీలో డ‌చ్ లాంగ్వేజ్‌కు చెందిన ఐయామ్ నాట్ ఏ రోబో ఆస్కార్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న‌ది.

అనూజ షార్ట్ ఫిల్మ్‌కు ఆడ‌మ్ గ్రేవ్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా, సుచిత్ర‌తో పాటు ప‌లువురు ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రొడ్యూస్ చేశారు. స‌జ్దా ప‌ఠాన్‌, అన‌న్యా షాన్‌బాగ్‌, న‌గేష్ బోన్ల్సే ఈ షార్ట్ ఫిల్మ్‌లో క...