Hyderabad, ఫిబ్రవరి 4 -- గర్భధారణ సమయంలో, మహిళలు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తల్లి తినే ఆహారం పిల్లల ఎదుగుదలపై, ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. గర్భధారణ సమయంలో మహిళలు పోషకాలు నిండిన పండ్లను తినాలని సలహా ఇస్తారు పెద్దలు. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని పండ్లు తినకూడదని చెబుతారు. బొప్పాయి, పైనాపిల్ వంటివి గర్భం ధరించాక తినకూడదు. అయితే నారింజ కూడా పుల్లని పండే. దీన్ని తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం నారింజ పండును గర్భిణులు తినవచ్చు.

గర్భధారణ సమయంలో నారింజ తినడం పూర్తిగా సురక్షితం. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నారింజలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇ...