భారతదేశం, మార్చి 29 -- Opinion : ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.

రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. 50 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 39 స్థానాలను తిరిగి నిటబెట్టుకొని ఆ పార్టీ పటిష్టంగానే ఉందని, క్షేత్రస్థాయిలో నాయకులు చెక్కు చెదరకుండా ఐక్యంగానే ఉన్నారని, వైఎస్ఆర్సీసీ అధినేత నాయకత్వం పట్ల పార్టీ శ్రేణులకు నమ్మకం ఉందనే సంకేతాన్ని ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ఫలిత...