భారతదేశం, జనవరి 27 -- ఓపెన్ఏఐ ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ కింద దీనిపై దిల్లీ హైకోర్టులో దావా నడుస్తోంది. హెచ్‌టీ డిజిటల్ స్ట్రీమ్స్, ఎన్డీటీవీ, డీఎన్‌పీఏ(డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్), ఐఈ(ఎక్స్‌ప్రెస్ గ్రూప్) ఆన్‌లైన్ మీడియాతోపాటు మరికొన్ని సంస్థలు సోమవారం దిల్లీ హైకోర్టులో ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా ఏఎన్ఐ కేసులో ఇంప్లీడ్ అయ్యాయి. అంతేకాదు న్యాయశాస్త్రం నిర్ణయించిన తీర్పు వార్తలను సేకరించి ప్రసారం చేసే విధానాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది.. కాబట్టి దీనిపై విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేసిన సంస్థలు కోరాయి.

ఏఎన్ఐ కేసులో తదుపరి విచారణకు ఒక రోజు ముందు ఈ ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలైంది. ఓపెన్ఏఐ వంటి సంస్థలు లైసెన్స్, ఆథరైజేషన్ లేదా అనుమతి లేకుండా తమ వెబ్‌సైట్స్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్, సమాచారాన్న...