భారతదేశం, మార్చి 4 -- Open School Exams: ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్‌ పరీక్షల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌లు చిత్తూరు జిల్లా పుంగ‌నూరు, గంగాధ‌ర్ నెల్లూరు జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకున్నాయి. ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన తొలిరోజే ఈ ఘ‌ట‌నలు వెలుగు చూశాయి.

పుంగ‌నూరు ప‌ట్ట‌ణంలోని జెడ్పీ బాలిక‌ల హైస్కూల్‌లో జ‌రిగే ఓపెన్ స్కూల్ ప‌రీక్ష‌ల్లో వంశీకృష్ణ అనే విద్యార్థి ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంది. కానీ అత‌ని పేరుతో మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన అత‌డి స్నేహితుడు ప్ర‌వీణ్ కుమార్‌ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యాడు. తొలిరోజు కావ‌డంతో స్క్వాడ్ త‌నిఖీలు ముమ్మ‌రంగా జ‌రిగాయి. త‌న స్నేహితుడి ప‌రీక్ష‌లు రాస్తూ ప్ర‌వీణ్ కుమార్ స్క్వాడ్ త‌నిఖీల్లో ప‌ట్టుప‌డ్డాడు.

వెంట‌నే ఆ విద్యార్థి వ‌ద్ద పరీక్ష‌కు సంబంధించిన ప‌త్రాల‌ను తీసుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సీఐ శ్రీ‌న...