భారతదేశం, ఫిబ్రవరి 16 -- Online Games : ఆన్ లైన్ గేమ్స్, ఫోన్ యాప్ లోన్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన కొందరు వాటికి బానిసై తమ బతుకులను ఆగం చేసుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆన్ లైన్ గేమ్స్ బానిసలుగా మారి ఆర్థికంగా చితికిపోయారు. వారిపై ఆధారపడ్డ వారి బతుకులను ఆగం చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన మధు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆన్ లైన్ లో రమ్మీతో పాటు బెట్టింగ్ లకు పాల్పడ్డాడు. అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో గతంలో ఒకసారి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య ఓ కూతురు ఉన్న మధుకు ఆన్ లైన్ గేమ్స్ వ్యసనంగా మారడంతో గేమ్స్ ఆడకుంటే బతకలేనన్నట్లుగా స్థాయికి చేరాడు. సోమవారం పురుగుల మం...