భారతదేశం, మార్చి 11 -- Online Games: హైదరాబాద్‌లో ఓ కాలేజీలో బీటెక్‌ చదువుతున్న నిఖిల్ రావు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసగా మారి భారీగా అప్పులు చేశాడు. ఏకైక కొడుకు ఆన్ లైన్ గేమ్ తో చేసిన అప్పులను తల్లిదండ్రులు ఇటీవల చెల్లించి సన్మార్గంలో పెట్టేందుకు యత్నించారు. ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడ్డ కొడుకు నిఖిల్ రావు ఆన్లైన్ గేమ్ వ్యసనం నుంచి బయట పడలేకపోయాడు. కొద్ది రోజులుగా నిఖిల్ రావు ఆన్లైన్ లో రుణాలు తీసుకుని మళ్ళీ ఆన్ లైన్ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు.

రెండు రోజుల క్రిందట హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరిన నిఖిల్ రావు తిరిగి సోమవారం హైదరాబాద్ వెళ్తానని చెప్పగా కరీంనగర్ లో తండ్రీ తిరుపతిరావు బస్ ఎక్కించాడు. కరీంనగర్ నుండి బయలుదేరి బస్సు తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్దకు చేరగానే నిఖిల్ రావు బస్సు దిగి గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి.. తమ వ్యవసాయ బావిలో దూక...