భారతదేశం, మార్చి 5 -- Online Betting: పెన్షన్ల డబ్బుతో పారిపోయిన సచివాలయ ఉద్యోగి వ్యవహారం మలుపు తిరిగింది. గత వారం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లకు చెల్లించాల్సిన రూ.8లక్షల రుపాయల నగదుతో వెల్ఫేర్ సెక్రటరీ లక్ష్మీ ప్రసాద్ పరారయ్యాడు. ఈ ఘటనపై మునిసిపల్ కమిషనర్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పెన్షన్ల డబ్బుతో పరారు కావడంతో ఉద్యోగి కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నిందితుడు సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో మోసపోయానని కొద్ది రోజులు గడువు ఇవ్వాలని లేకపోతే చావే శరణ్యమంటూ వేడుకున్నాడు.

దాచేపల్లిలో పెన్షన్ల డబ్బుతో పారిపోయిన సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ లక్ష్మీప్రసాద్ సోషల్‌ మీడియాలో తనకు కొంత సమయం ఇవ్వాలంటూ వీడియోతో మునిసిపల్ అధికారులకు విజ...