Hyderabad, జనవరి 3 -- ఏ కూర వండాలన్నా కచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఇగురు ఎక్కువగా రావాలంటే ఉల్లిపాయలు వేయాల్సిందే. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు విపరీతంగా మంట పుట్టి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇది కాస్త ఇబ్బంది పెడుతుంది. కేవలం కోసే వాళ్ళకే కాదు, ఉల్లిపాయలు కోసేటప్పుడు ఆ గదిలో ఉన్న వారికి కూడా కళ్లు మండడం అనేది మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ళు మండుతాయి. అలా కళ్ళు మండకుండా ఉల్లిపాయలు కోసే ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

ఉల్లిపాయలను కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి ముఖ్యమైన కారణం వాటిలో ఉండే ఎంజైమ్‌లు. ఉల్లిపాయను కట్ చేసినప్పుడు లోపల ఉన్న ఎంజైమ్ నుండి ఒక రకమైన వాయువు బయటకు విడుదలవుతుంది. ఇది ముక్కు, కళ్ళను చికాకు పెడుతుంది. దీనివల్లే కళ్ళనుండి కన్నీళ్లు ధారాపాతంగా వస్తూ ఉంటాయి. కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కో...