భారతదేశం, ఫిబ్రవరి 10 -- 2025 వాలెంటైన్స్ డే సేల్‌ను వన్‌ప్లస్ ప్రకటించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ తాజా స్మార్ట్‌ఫోన్లపై అనేక ఆఫర్లు, డీల్స్ లభిస్తాయి. రెడ్ రష్ డేస్ సేల్ పేరుతో ఈ సేల్ ఫిబ్రవరి 11న ప్రారంభమై ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతుంది. వన్‌ప్లస్ ఫోన్లపై లభించే డిస్కౌంట్లు, డీల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి. ఈ సేల్‌లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ 4, ఇతర స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. మీ ప్రియమైన వారికి గిఫ్ట్ కొనాలనుకుంటే ఈ ఆఫర్ గురించి ఆలోచించొచ్చు.

వన్‌ప్లస్ 13 కొనుగోలుదారులు రూ.5,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 13R కొనుగోలుదారులు రెడ్ రష్ డేస్ సేల్ సమయంలో రూ.3,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్లు ఎంచుకున్న బ్యాంక్ కార్డులకు ...