భారతదేశం, డిసెంబర్ 19 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్, తన 'ఆర్​' సిరీస్‌లో సరికొత్త మోడల్ వన్‌ప్లస్ 15ఆర్​ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ 13ఆర్​కి సక్సెసర్​గా వచ్చిన ఈ ఫోన్​లో.. ప్రాసెసర్, బ్యాటరీ, డిస్‌ప్లే విభాగాల్లో కీలక మార్పులు కనిపించాయి. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీ టాప్ మోడల్ వన్‌ప్లస్ 15తో పోలిస్తే ఈ కొత్త గ్యాడ్జెట్​ ఎంతవరకు మెరుగ్గా ఉందో ఇప్పుడు చూద్దాము..

వన్‌ప్లస్ 15: ఈ స్మార్ట్​ఫోన్​లో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంది. ఇది భారీ గేమ్స్, మల్టీ టాస్కింగ్‌ను చాలా వేగంగా హ్యాండిల్ చేస్తుంది.

వన్‌ప్లస్ 15ఆర్​: ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. దీనిని మిడ్-రేంజ్, ప్రీమియం ఫోన్ల కోసం రూపొందించారు. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 38% మెర...