భారతదేశం, ఏప్రిల్ 8 -- One state-one RRB: మెరుగైన నిర్వహణ సామర్థ్యం, వ్యయ హేతుబద్ధీకరణను సాధించడానికి 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో, మే 1, 2025 నుంచి ఒక స్టేట్-వన్ ఆర్ఆర్బీ సాకారమవుతుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) నాలుగో విడత ఏకీకరణతో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంక్ ల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది.

గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ వంటి 11 రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీలను వరుసగా ఆయా రాష్ట్రాల్లోని ఒకే సంస్థలో విలీనం చేయనున్నారు. ఏప్రిల్ 5, 2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం విలీనం అమలు తేదీని మే 1గా నిర్ణయించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల...