భారతదేశం, ఏప్రిల్ 5 -- One Nation One Election: 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' లేదా జమిలి ఎన్నికల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం స్పష్టతనిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యాచరణ సాధ్యం కాదని ఆమె తేల్చి చెప్పారు. తమిళనాడులోని కట్టంకుళత్తూరులోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

2024 లోక్ సభ ఎన్నికల కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, భారతదేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఖర్చులను చాలావరకు తగ్గించవచ్చని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి దాదాపు 1.5 శాతం లేదా రూ.4.50 లక్షల కోట్లు యాడ్ అవుతాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ''పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడాని...