Hyderabad, మార్చి 16 -- Sree Vishnu Om Bheem Bush: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు మరోసారి కొలబరేట్ అయిన సినిమా ఓం భీమ్ బుష్. దీనికి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు హుషారు సినిమా తెరకెక్కించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ ఓం భీమ్ బుష్ ట్రైలర్ మార్చి 15న విడుదలైంది.

ఓం భీమ్ బుష్ ట్రైలర్ విడుదల చేస్తూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "మార్చి 22న థియేటర్స్‌కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్స్‌తో వెళితే ఇంక బాగా ఎంజాయ్ చేస్తారు. 22న ఎవరూ మిస్ అవ్వదు. మ...