Hyderabad, మార్చి 12 -- బీచ్‌లను ఇష్టపడేవారు ఎంతోమంది. ముఖ్యంగా వేసవికాలంలో బీచులు ఉన్న ప్రదేశానికే వెకేషన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ మేము అలాంటి ఒక బీచ్ వెకేషన్ గురించి చెప్పాము. ఈ బీచ్ లో ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంలో కనిపిస్తుంది.

ఇది కర్ణాటకలోని గోకర్ణలోని ఉత్తర కెనరా జిల్లాలో ఉన్న అద్భుతమైన బీచ్ ఇది. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేలా ఉంటుంది. దీని తీర ప్రాంతం బంగారం లాంటి ఇసుకతో నిండి ఉంటుంది. కాస్త ఎత్తు నుంచి ఏదైనా కొండపై నుంచి చూస్తే ఈ బీచ్ అందాన్ని వర్ణించడం ఎంత కష్టమో తెలుస్తుంది.

ఓం అనే గుర్తు హిందీ అక్షరం 'అ' రూపంలో ఉంటుంది. రెండు అర్థ చంద్రాకారాలు కలిసిన ఓం లాగే ఈ బీచ్ కూడా ఉంటుంది. ఇది సూర్యాస్తమయంలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దీన్ని అక్కడ ఉన్న స్థానికులు ఎంత శుభప్రదంగా భావిస్తారు.

ఈ ...