భారతదేశం, మార్చి 3 -- భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 1000కిపైగా మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించాలని యోచిస్తోందని సమాచారం. ఎక్కువ లాభాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ లేఆఫ్స్​ వార్తల మధ్య సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఓలా ఎలక్ట్రిక్​ స్టాక్​ నూతన 52- వీక్​ కనిష్ఠ స్థాయిని తాకింది.

ఈ ఈవీ తయారీ సంస్థ గత ఏడాది దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. కాగా సంస్థ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నారన్న తాజా వార్తలపై ఓలా ఎలక్ట్రిక్ ఇంకా స్పందించలేదు.

గత ఏడాది ఐపీఓగా స్టాక్​ మార్కెట్​లోకి అడుగుపెట్టిన ఓలా ఎలక్ట్రిక్​కి కాస్త గడ్డుకాలమే నడుస్తోందని చెప్పాలి. గత నెలలో 25,000 యూనిట్లను విక్రయించడంతో ప్రస్తు...