భారతదేశం, ఫిబ్రవరి 7 -- డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ సోద‌రుడు సాయిరాం శంక‌ర్ హీరోగా కొంత గ్యాప్ త‌ర్వాత ఒక ప‌థ‌కం ప్ర‌కారం మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చాడు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ వినోద్ విజ‌య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆషిమా న‌ర్వాల్‌, శృతి సోథి, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. శుక్ర‌వారం రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

సిద్ధార్థ్ నీల‌కంఠ (సాయిరామ్ శంక‌ర్‌) ఓ లాయ‌ర్‌. చేప‌ట్టిన ప్ర‌తి కేసులో విజ‌యం సాధిస్తుంటాడు. భార్య సీత (ఆషిమా న‌ర్వాల్‌) మిస్సింగ్‌తో అత‌డి జీవితం మొత్తం త‌ల‌క్రిందుల‌వుతుంది. డ్ర‌గ్ ఎడిక్ట్‌గా మారిపోతాడు. దివ్య (భాను) అనే అమ్మాయి హ‌త్య కేసులో సిద్ధార్థ్‌ను హంత‌కుడిగా అనుమానిస్తాడు ఏసీపీ ర‌ఘురామ్ (స‌ముద్ర‌ఖ‌ని). అత‌డిని అరెస్ట్ చేస్తాడు.

త‌న‌ను తాను న...