Hyderabad, మార్చి 18 -- నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందం నుంచి ఆరోగ్యం వరకూ, ఫ్యాషన్ నుంచి పేరెంటింగ్ వరకూ ప్రతి విషయానికి అక్కడ సలహాలు, చిట్కాలు దొరుకుతున్నాయి. అంతేకాదు నెట్టింట్లో చెప్పే చాలా చిట్కాలు ట్రెండింగ్ గా మారి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ప్రజలు వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే వాటిని అనుసరించడం కూడా మొదలు పెడుతున్నారు. ఇది ఎంతవరకూ సరైనదీ అనే విషయాన్ని పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆయిల్ పుల్లింగ్(Oil Pulling) గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ఆయిల్ పుల్లింగ్(Oil Pulling) అంటే నోట్లో నూనె పోసుకుని పుక్కలించడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగవుతుందని సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది పోస్టులు, వీడియోలు చేసి పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల నోటి దుర...