Hyderabad, ఫిబ్రవరి 7 -- Oil free Mutton curry: ఏ నాన్ వెజ్ కర్రీ చూసినా పైన నూనె తేలుతూ ఉంటుంది. అందుకే ఎక్కువమంది ఫిట్నెస్ ఫ్రీక్స్, బరువు తగ్గాలనుకునేవారు... నూనె ఉన్న ఆహారాలను తినడానికి ఇష్టపడరు. నూనె ఎక్కువగా తింటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఇక్కడ మేము నూనె అవసరమే లేని మటన్ కర్రీని ఎలా వండాలో చెప్పాము. ఈ మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేయకుండా మటన్ గ్రేవీ రుచిగా ఉంటుందా అనే సందేహం రావచ్చు. అలాంటి సందేహం పెట్టుకోకండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరే వండుకుంటారు.

మటన్ - అరకిలో

ఉల్లిపాయలు - రెండు

టమాటోలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

ఉప్పు - రుచికి సరి...