Hyderabad, ఫిబ్రవరి 6 -- పూరీలు, పకోడీలు, చికెన్ వేపుళ్లు వంటివి వేయించి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. వేపుళ్లకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా చలికాంలో స్పైసీ వేపుళ్లు చాలా ఇష్టంగా తింటారు. నూనెలో వేయించిన ఆహారం మన ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ తినకుండా ఉండలేరు. అందులో కొన్ని రకాల నూనెలు వాడితే ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కొన్ని రకాల నూనెలు గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అలాగే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం వేపుళ్లు చేయడానికి ఉత్తమ నూనెను ఎంపిక చేసుకోవాలి. ఏ నూనె వాడడం వల్ల గుండెకు హానికరం కాదో తెలుసుకోండి.

మీకు ఇష్టమైన చిరుతిండిని ఫ్రై చేయడానికి మీరు ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. దీని స్మోక్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి డీప్ ఫ్రై చేయడానికి ఇది ఉత్తమం. నూనె రుచి, సువాసనను...