Hyderabad, ఏప్రిల్ 18 -- Odela 2 OTT Streaming Release: ఓటీటీలోకి నిన్న (ఏప్రిల్ 17) థియేటర్లలో విడుదలైన తమన్నా ఓదెల 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందనే సమాచారం జోరుగా ప్రచారం జరుగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా స్ట్రయిట్ తెలుగు మూవీ చేసి చాలా కాలం అయింది.

అరణ్మనై 4 తమిళ హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులో బాక్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. దీనికంటే ముందు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది తమన్నా. ఆ తర్వాత తమన్నా భాటియా చేసిన స్ట్రయిట్ తెలుగు మూవీ ఓదెల 2. చాలా కాలం గ్యాప్ తర్వాత తమన్నా తెలుగు సినిమా చేయడం, ఓటీటీలో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ కావడంతో ఓదెల 2పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇక ఓదెల 2 నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దానికి తగినట్లుగా టీజర్, ట్రైలర్ ఉండటంతో అంచనాలు మరి...