Hyderabad, ఏప్రిల్ 8 -- Odela 2 OTT: తమన్నా నటించిన ఓదెల 2 మూవీ వచ్చే వారమే థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ పై స్పష్టత వచ్చింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తోంది.

ఓదెల 2 మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. ఈ సినిమా హక్కుల కోసం రూ.11 కోట్లు చెల్లించినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. మూవీ టీజర్ ను మహాకుంభమేళాలో రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) ట్రైలర్ ను తీసుకొచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.

2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ క...