ఆంధ్రప్రదేశ్,అనంతపురం, మార్చి 28 -- ఉమ్మడి అనంతపురం జిల్లా ఓబులాపురం గనుల కేసులో వాదనలు ముగిశాయి. ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఈ కేసులో దాదాపు 16 ఏళ్లకుపైగా విచారమ కొనసాగుతోంది. ఎట్టకేలకు వాదనలు ముగియటంతో.. మే 6వ తేదీన సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.

ఈ కేసులో గాలి జనార్ధన్‌ రెడ్డితో పాటు పలువురు ఐఎస్ఎస్ అధికారులు ఉన్నారు. తెలంగాణకు చెందిన అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితోపాటు వీడీ రాజగోపాల్‌, జనార్ధన్‌రెడ్డి పీఏ అలీఖాన్‌ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 200 మందికిపైగా సాక్ష్యులను విచారించగా. 3వేలకుపైగా డాక్యుమెంట్లను కోర్టు పరిశీలించింది. ఇరువైపు వాదనలు తర్వాత. మే 6న తుది తీర్పు రానుంది. ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఉత్కంఠ నెలకొం...