Hyderabad, మార్చి 4 -- ప్రపంచంలో ఊబకాయం, అధిక బరువు బారిన పడుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. లాన్సెట్ అధ్యయనంలో ప్రపంచంలోని అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న పెద్దలలో సగానికి పైగా కేవలం ఎనిమిది దేశాలలో నివసిస్తున్నారని తేలింది. ఈ దేశాల్లో 1990 నుండి ఊబకాయుల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తోంది.

ప్రస్తుతం ఆ ఎనిమిది దేశాల్లోనే 2 బిలియన్లకు పైగా ప్రజలు ఇప్పుడు ఊబకాయంతో నివసిస్తున్నారు. పెరుగుతున్న ఈ ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి సమర్థవంతమైన వ్యూహాల అవసరాన్ని అధ్యయనం హైలైట్ చేస్తుంది.

పాతికేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 2.11 బిలియన్ల పెద్దలు, 5 నుండి 24 సంవత్సరాల వయస్సు గల 493 మిలియన్ల మంది పిల్లలు, యువకులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారని అధ్యయనం చెబుతోంది. 2021 లో, అధిక బరువు లేదా ఊబకాయంతో నివసిస్తున్న మొత్తం పెద్దలలో సగానికి పైగా కేవలం ఎన...