భారతదేశం, ఏప్రిల్ 11 -- రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని.. తనపైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాననే విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని, సమైక్యాంధ్రలో తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తనకు వేరే ఆశలు లేవని, ప్రజల ప్రేమాభిమానాలు ఉంటే చాలని అన్నారు. మీ ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పినట్టే రుజువు చేస్తున్నానని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో శుక్రవారం జరిగిన మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు.

'చరిత్రలో శాశ్వతంగా నిలిచేపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరు. బడుగు బలహీనవర్గాల ఆరాధ్య దైవం ఆయన. 198 ఏళ్లయినా ఇంకా పూలే జయంతి జరుపుకుంటున్నామ...