తెలంగాణ,నకిరేకల్‌, మార్చి 5 -- తెలంగాణలో మరోసారి అధికార పార్టీ ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. గతంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వేముల వీరేశానికి నగ్నంగా వీడియో కాల్‌ చేసి బెదిరింపులకు దిగారు. దీంతో షాక్ అయిన వీరేశం. పోలీసులను ఆశ్రయించారు.

ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేశారు. కాల్ లిఫ్ట్ చేసిన వీరేశానికి. అవతలి వ్యక్తి నగ్నంగా కనిపిస్తూ కాల్‌ మాట్లాడారు. ఈ క్రమంలో కేటుగాళ్లు స్క్రీన్ రికార్డు చేశారు. ఆ తర్వాత. ఆ వీడియోను ఆయనకే పంపించారు.అనంతరం డబ్బులు కావాలని డిమాండ్‌ చేశారు. కానీ వారి బెదిరింపులకు ఎమ్మెల్యే స్పందించలేదు. దీంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలు. కార్యకర్తలకు పంపారు.

వీడియో వచ్చిన నేత...